మన దేశంలోని అత్యంత ప్రసిద్ధ పాఠశాలల్లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి. అంబానీ కుటుంబానికి చెందిన కోడలు నీతా అంబానీ ఈ పాఠశాల వ్యవస్థాపకురాలు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కుమారుడు నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుమార్తె వరకు స్టార్ కిడ్స్ అందరూ ఈ స్కూల్‌లోనే చదువుతున్నారు. కరణ్ జోహార్ కుమారుడు, కుమార్తె, షాహిద్ కపూర్ కుమారుడు, కరీనా కపూర్ ఇద్దరు కుమారులు కూడా ఈ పాఠశాల విద్యార్థులే.