TS Staff Nurse Exam: తెలంగాణ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. ఒకే రోజు 2 సెషన్లలో

|

May 03, 2023 | 12:48 PM

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానం (సీబీటీ)లో నిర్వహించాలని తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB)..

TS Staff Nurse Exam: తెలంగాణ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. ఒకే రోజు 2 సెషన్లలో
Telangana Staff Nurse
Follow us on

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానం (సీబీటీ)లో నిర్వహించాలని తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB) నిర్ణయించింది. పరీక్ష కోసం హైదరాబాద్‌తోపాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే రోజు రెండు సెషన్లలో.. ఉదయం సగం మందికి, సాయంత్రం సగం మందికి పరీక్ష నిర్వహించనున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ పరీక్ష పేపర్‌ను తయారు చేయగా, హైదరాబాద్‌ జేఎన్‌టీయూ పరీక్షలు నిర్వహిస్తుంది. ఒకట్రెండు నెలల్లో పరీక్ష జరిగే అవకాశం ఉందని సమాచారం.

అందుకే పెరిగిన డిమాండ్‌..

కాగా స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఈ పోస్టులకు పేస్కేల్‌ రూ. 36,750ల నుంచి రూ. 1,06,990 మధ్య ఉండటంతో డిమాండ్‌ పెరిగింది. 5,204 పోస్టులకు గాను ఇప్పటివరకు 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో స్టాఫ్‌నర్స్‌ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు.

ఎంపిక విధానం ఇలా..

రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. మిగిలిన 20 పాయింట్లకు వెయిటేజీ ఆధారంగా కేటాయిస్తారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. అంటే ఇతర ప్రాంతాల్లో 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.