TS Lawcet 2022 Counselling: నవంబరు 2 నుంచి తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ 2022 కౌన్సెలింగ్ రేపట్నుంచి (నవంబర్ 2) ప్రారంభంకానున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది..
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ 2022 కౌన్సెలింగ్ రేపట్నుంచి (నవంబర్ 2) ప్రారంభంకానున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ సందర్భంగా లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం.. అధికారిక వెబ్‌సైట్ లో కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ అప్‌లోడింగ్ నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ నవంబర్ 12 వరకు కొనసాగుతుంది. సర్టిఫికెట్ల ఫిజికల్ వెరిఫికేషన్ నవంబర్ 14 నుంచి 16 వరకు ఉంటుంది. ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్ధుల లిస్ట్ నవంబర్ 17న విడుదల చేస్తారు.
నవంబర్ 18 నుంచి 20 వరకు ఫేజ్-1కు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇక ఫస్ట్ రౌండ్ సీట్లను నవంబర్ 22న కేటాయిస్తారు. మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్ధులు నవంబర్ 23 నుంచి 26వ తేదీ వరకు ఆయా లా కాలేజీల్లో రిపోర్ట్ చేయవల్సి ఉంటుంది. ఇక నవంబర్ 28 నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం క్లాస్‌లు ప్రారంభమవుతాయి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.