TS LAWCET 2021: ఈ నెల 21, 22న లాసెట్‌ వెబ్‌సైట్‌ పని చేయదు.. హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్ చేసుకోవడానికి ఈ రోజే చివరిరోజు..

|

Aug 20, 2021 | 5:54 AM

TS LAWCET 2021: ఈ నెల 21, 22న లాసెట్‌ వెబ్‌సైట్‌ పని చేయదని లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి వెల్లడించారు. నిర్వహణ పనుల నిమిత్తం 21, 22న వెబ్‌సైట్‌ పనిచేయదని

TS LAWCET 2021: ఈ నెల 21, 22న లాసెట్‌ వెబ్‌సైట్‌ పని చేయదు.. హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్ చేసుకోవడానికి ఈ రోజే చివరిరోజు..
Tslawcet
Follow us on

TS LAWCET 2021: ఈ నెల 21, 22న లాసెట్‌ వెబ్‌సైట్‌ పని చేయదని లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి వెల్లడించారు. నిర్వహణ పనుల నిమిత్తం 21, 22న వెబ్‌సైట్‌ పనిచేయదని స్పష్టం చేశారు. నేటి రాత్రి 7 గంటల్లోగా అభ్యర్థులు లాసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 23, 24న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జరగనున్నాయి.ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్స్‌కి 28,904 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకోగా.. ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్స్‌కి 7,676 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఎల్‌ఎంకి 3,286 మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటిలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏపీలో ఉన్నాయి.

గతంలో న్యాయ విద్య కోర్సులు అభ్యసించిన వారు కోర్టులకే పరిమితమయ్యే పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు కార్పొరేట్‌ రంగంలో సైతం లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్‌ ప్రపంచం విస్తరించాక ఈ కెరీర్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల విస్తరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు దేశంలో ముఖ్యమైన కేసులు వాదించేందుకు గంటల లెక్కన భారీ ఫీజులు తీసుకునే అడ్వకేట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చట్టాలపై పట్టు, వాదనాlపటిమ, చురుకుదనం ఉన్నవారికి లా చక్కటి కెరీర్‌.

ఇంటర్మీడియెట్‌/10+2తోనే దేశవ్యాప్తంగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ప్రధానంగా బీఏ ఎల్‌ఎల్‌బీ/బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ/ బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ/బీబీఏ ఎల్‌ఎల్‌బీలో చేరొచ్చు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ‘కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)లో ప్రతిభ చూపాలి. క్లాట్‌తోపాటు దేశంలో న్యాయవిద్యకు సంబంధించి ఆలిండియా లా ఎంట్రన్స్‌ టెస్ట్, లా స్కూల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌– ఇండియా(ఎల్‌శాట్‌–ఇండియా); టీఎస్‌లాసెట్‌/ఏపీలాసెట్‌ (తెలుగు రాష్ట్రాల్లో) వంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకావచ్చు.

Crime News: సంబరాల కోసం అంబులెన్స్‌లను వాడుకున్న యువకులు.. డ్రైవర్లతో సహా నలుగురిపై కేసు నమోదు

పదో తరగతి పాస్‌ కాలేదు కానీ ముఖ్యమంత్రిగా పని చేశాడు..! 86 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ పరీక్ష రాస్తున్నాడు..

Viral Photos: కుక్కల పెళ్లికి మనుషుల హడావిడి..! BMW కారు.. కమ్మని విందు..