TS Contract Degree Lecturers: కాంట్రాక్ట్‌ డిగ్రీ అధ్యాపకులకు తీపికబురు.. ఆగస్టు 31లోపు వారందరినీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఉత్తర్వులు

|

Jul 30, 2023 | 1:35 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 527 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులను 2023-24 విద్యా సంవత్సరం కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలల క్రితం 270 మంది కాంట్రాక్ట్‌..

TS Contract Degree Lecturers: కాంట్రాక్ట్‌ డిగ్రీ అధ్యాపకులకు తీపికబురు.. ఆగస్టు 31లోపు వారందరినీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఉత్తర్వులు
Contract Degree Lecturers
Follow us on

హైదరాబాద్‌, జులై 30: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 527 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులను 2023-24 విద్యా సంవత్సరం కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలల క్రితం 270 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులను క్రమబద్ధీకరించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రక్రియలో మిగిలిపోయిన వారిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు, ఆగస్టు 31వ తేదీలోపు వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని వాకాటి కరుణ సూచించారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను సైతం విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని కూడా నియమించుకోవాలని కళాశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్‌ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.