TS ECET – 2021 exam time table: టీఎస్ ఈసెట్-2021 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. జులై 1వ తేదీన టీఎస్ ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట రమణారెడ్డి తెలిపారు. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ విభాగాల అభ్యర్థులకు జులై 1న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. దీంతోపాటు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాల వారికి పరీక్షను నిర్వహించనున్నట్లు రమణారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) ఈ పరీక్షను వరుసగా ఏడోసారి నిర్వహించనుంది. బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మార్చి 17న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 22వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.250 ఆలస్య రుసుంతో మే 31వ తేదీ వరకు, రూ.500 రుసుంతో జూన్ 14 వరకు, రూ.2,500 రుసుంతో జూన్ 24వ వరకు, రూ. 5వేల అపరాద రుసుంతో జూన్ 28 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 400 కాగా ఇతర అభ్యర్థులకు రూ.800.
కాగా పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://ecet.tsche.ac.in కు లాగిన్ అయి తెలుసుకోవచ్చు.
Also Read: