తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం (మే 25) విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌లో మంగళవారం జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, ఎంసెట్ ఛైర్మన్ కట్టా నర్సింహారెడ్డి, కన్వీనర్ డీన్‌కుమార్, కోకన్వీనర్ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ర్యాంకులను విడుదల చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగిన పరీక్షల్లో ఇంజినీరింగ్‌కు 1,95,275 మంది, అగ్రికల్చర్‌కు 1,06,514 మంది హాజరయ్యారు. ఎంసెట్ ప్రాథమిక కీలు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. రేపు ఫలితాలతోపాటు తుది ఆన్సర్ కీ కూడా విడుదలకానుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.