TOSS 10th and Inter Results 2025: తెలంగాణ ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

రాష్ట్రంలోని దూర విద్య ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) శనివారం (జూన్‌ 7) విడుదల చేసింది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ లో తమ అడ్మిషన్‌ నెంబర్‌ లేదా రోల్‌ నెంబర్‌ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు..

TOSS 10th and Inter Results 2025: తెలంగాణ ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
TOSS SSC and Inter Results

Updated on: Jun 07, 2025 | 3:37 PM

హైదరాబాద్‌, జులై 7: తెలంగాణ రాష్ట్రంలోని దూర విద్య ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) శనివారం (జూన్‌ 7) విడుదల చేసింది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ అడ్మిషన్‌ నెంబర్‌ లేదా రోల్‌ నెంబర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి రిజల్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించారు.

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియట్‌ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరోవైపు 2025-26 విద్యాసంవత్సరానికి తెలంగాణ ఒపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌)లో పదో తరగతి, ఇంటర్‌మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదివేందుకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ జూన్‌ 12వ తేదీన విడుదల కానుంది. ఇక ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగిన వారు మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో ఆగస్టు 12, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టాస్‌ డైరెక్టర్‌ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వెల్లడికాడంతో ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమైనాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.