TGPSC Group 3 Merit List 2025: టీజీపీఎస్సీ గ్రూప్ 3 అభ్యర్ధులకు అలర్ట్.. ఈ సర్టిఫికెట్లు ఉన్నాయా? షెడ్యూల్ వచ్చేసింది..
గ్రూప్ 3 పోస్టులకు రాత పరీక్షల ఫలితాలు ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెరిట్ లిస్ట్‌లోని అభ్యర్థులందరికీ ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 18 నుంచి జులై 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు..

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ గ్రూప్ 3 పోస్టులకు రాత పరీక్షల ఫలితాలు ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెరిట్ లిస్ట్‌లోని అభ్యర్థులందరికీ ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 18 నుంచి జులై 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆయా తేదీల్లో షెడ్యూల్‌లో సూచించిన విధంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. మెరిస్ట్‌లిస్ట్‌లోని అభ్యర్ధులు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావల్సి ఉంటుంది. అభ్యర్థుల తమ హాల్‌టికెట్‌తో పాటు వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లవల్సిన సర్టిఫికెట్ల వివరాలకు సంబంధించిన ప్రత్యేక జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 3 అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు ఇవే..
- అప్లికేషన్ ఫాం పీడీఎఫ్
- హాల్ టికెట్
- ఆధార్ లేదా ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు ఐడీ
- విద్యార్హతల సర్టిఫికెట్లు
- పుట్టిన తేదీ ధృవీకరణ సర్టిఫికెట్
- స్కూల్ స్టడీ సర్టిఫికెట్
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- నిరుద్యోగ డిక్లరేషన్ సర్టిఫికెట్
- సర్వీస్ సర్టిఫికెట్ (ఒక వేళ ఉద్యోగి అయితే)
- స్పోర్ట్స్ రిజర్వేషన్ సర్టిఫికెట్
- ఎక్స్ సర్వీస్‌మెన్
- కుల, ఆదాయ సర్టిఫికెట్లు
- నాన్ క్రీమీలేయర్ (బీసీలకు మాత్రమే)
- ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్
- వికలాంగులైతే ధృవీకరణ సర్టిఫికెట్
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన గ్రూప్ 3 అభ్యర్థుల జాబితాను ఈ కింది లింక్‌లో చెక్ చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అటెస్టెడ్) కూడా తీసుకురావాల్సి ఉంటుందని కమిషన్ సూచించింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 3 మెరిట్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.