TG Inter Supplementary Result Date: ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్‌పై కీలక అప్డేట్.. మరో 5 రోజుల్లోనే ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ కూడా ముగిసింది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక సమాచారం

TG Inter Supplementary Result Date: ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్‌పై కీలక అప్డేట్.. మరో 5 రోజుల్లోనే ఫలితాలు విడుదల
TG Inter supplementary Result Date

Updated on: Jun 04, 2026 | 3:53 PM

హైదరాబాద్‌, జూన్‌ 4: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ కూడా ముగిసింది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఫలితాలను మరో 5 రోజుల్లోనే వెల్లడించనున్నట్లు తెలిపింది. అంటే జూన్‌ 10వ తేదీలోపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇంటర్ బోర్డు విడుదల చేయనుంచి. ఈ మేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం, స్కానింగ్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫలితాల విడుదలకు సంబంధించిన తుది సాంకేతిక కసరత్తు జరుగుతుంది. వచ్చే వారంలో ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి మే 21 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు గరిష్ట స్థాయిలో మొత్తం 3,98,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలు వెలువడితేగానీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవదు. దీంతోపాటు డిగ్రీ ప్రవేశాలు, ఇతర ఉన్నత విద్యా అడ్మిషన్ ప్రక్రియలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఫలితాలను త్వరగా ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.

Also Readపులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్‌ విసిరే చిక్కు ప్రశ్న

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,98,358 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. దీంట్లో జనరల్ విభాగంలో మొత్తం 3,69,294 మంది విద్యార్ధులు, ఒకేషనల్ విభాగంలో 28,703 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 2,67,141 మంది ఉండగా.. సెకండియర్ నుంచి 1,30,856 మంది విద్యార్థులు ఉన్నారు. అటు ఏపీలో మే 21వ తేది నుంచి మొదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 4వ తేదీతో అంటే నేటితో ముగియనున్నాయి.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us