Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ, కొల్లిపర మండలం అత్తోట రైతు యర్రు బాపురావు వినూత్నంగా స్పందించారు. ఆయన విద్యార్థులతో కలిసి తన వరి పొలంలో "ప్రజల రాజధాని అమరావతి" అని అక్షరాలను రూపొందించారు. ఏపీ విభజన జరిగి 12 ఏళ్లు అవుతున్నా రాజధాని విషయంలో ఇబ్బందులు పడుతున్నందున, అమరావతి పునర్నిర్మాణానికి సంఘీభావంగా ఈ పచ్చని ఆకృతిని ప్రదర్శించారు.