హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా విద్యాశాఖ డీఎస్సీ పరీక్ష తేదీలకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం.. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను జూన్ 28న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. ఇప్పటికే అభ్యర్ధులు పోటాపోటీగా ప్రిపరేషన్‌ను సాగిస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి త్వరలోనే హాల్ టికెట్లు కూడా వెలువడనున్నాయి.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే నోటిఫికేషన్ విడుదల సమయంలోనే జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తాత్కాలిక పరీక్షల తేదీలను వెల్లడించింది. ఆ తర్వాత సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్ విడుదల చేయడంలో విద్యాశాఖ ఆలస్యం చేయడంతో అభ్యర్ధుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త తేదీలు వెలువడ్డాయి. దాదాపు తొలుత ప్రకటించిన షెడ్యూల్‌నే ఖరారు చేసినా.. పరీక్షల తేదీలు కొద్దిగా మారాయి. జులై 17 నుంచి మొత్తం 13 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి.
అయితే జులై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో మాత్రం ఎటువంటి పరీక్షలు లేవు. జులై 18న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఫిజిక్స్, పీఈటీ సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్(హిందీ)తో పరీక్షలు ముగుస్తాయి. రోజుకు రెండు షెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఆన్‌లైన్ జరిగే ఈ పరీక్షలు ఏ మాధ్యమం, ఏ రోజు, ఏ జిల్లాల వారికి ఏ పరీక్ష అనే వివరాలను షెడ్యూల్‌లో వివరంగా పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.