నిరుద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థ శుభవార్త తెలిపింది. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ అప్రెంటిస్ శిక్షణ ఏడాది పాటు ఉంటుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 92 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇంజనీరింగ్ డిగ్రీ (ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, సివిల్, ఐటీ), డిప్లొమా (డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్ఈ) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) 2020/2021/2022 సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 ఏళ్లి మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో రిజిష్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఉంటుంది.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 9000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు రూ. 8000 స్టైఫండ్‌గా చెల్లిస్తారు.
* ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 11వ తేదీ, ట్రాన్స్‌కో దరఖాస్తుకు ఏప్రిల్ 12ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..