AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: విద్యార్థులకు ఇస్రో బంపరాఫర్‌.. ఐఐఆర్‌ఎస్‌ నుంచి సర్టిఫికేట్ కోర్సు. ఆన్‌లైన్‌లో పూర్తిగా ఉచితం.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులకు సదవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు పొందే అవకాశాన్నిచ్చింది. ఇస్రోకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్‌), డెహ్రాడూన్‌ ఈ సర్టిఫికేట్‌ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సులో కేవలం విద్యార్థులే కాకుండా..

ISRO: విద్యార్థులకు ఇస్రో బంపరాఫర్‌.. ఐఐఆర్‌ఎస్‌ నుంచి సర్టిఫికేట్ కోర్సు. ఆన్‌లైన్‌లో పూర్తిగా ఉచితం.
Isro Course
Narender Vaitla
|

Updated on: Apr 08, 2023 | 6:13 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులకు సదవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు పొందే అవకాశాన్నిచ్చింది. ఇస్రోకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్‌), డెహ్రాడూన్‌ ఈ సర్టిఫికేట్‌ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సులో కేవలం విద్యార్థులే కాకుండా పరిశోధకులు, ప్రభుత్వ సైంటిఫిక్‌ సిబ్బంది కూడా చేరొచ్చు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సింథటిక్‌ అపార్చుర్‌ రాడార్‌ డేటా ప్రాసెసింగ్‌లో సర్టిఫికేట్‌ అందిస్తారు.

ఈ కోర్సును పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ కోర్సును ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌ గంటన్నరపాటు సాగుతుంది. ఆన్‌లైన్‌ సెషన్‌ సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఉంటుంది. కోర్సులో పాల్గొనే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన టెక్నికల్‌/సైంటిఫిక్‌ సిబ్బంది/ ఫ్యాకల్టీ, యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూ్షన్స్‌లోని పరిశోధకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇదిలా ఉంటే ఈ కోర్సులో చేరే వారికి రిమోట్‌ సెన్సింగ్‌, డిజిటల్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌పై కనీస పరిజ్ఞానం ఉండాలి. కనీసం 70 వాతం హాజరు కలిగిన వారికి మాత్రమే సర్టిఫికేట్‌ అందిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇందులో చేరాలనుకునే సంస్థలు, యూనివర్సిటీలు, డిపార్ట్‌మెంట్లు సొంతంగా కో-ఆర్డినేటర్‌ను నియమించుకోవాలి. సదరు కో-ఆర్డినేటర్‌ రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి