TG TET 2025 Admit Cards: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) జూన్ సెషన్ హాల్‌టికెట్స్ విడుదలయ్యాయి. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి రోజుకు రెండు షిఫ్ట్‌ల వారిగా జరగనున్నాయి..

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) జూన్ సెషన్ హాల్‌టికెట్స్ విడుదలయ్యాయి. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి రోజుకు రెండు షిఫ్ట్‌ల వారిగా జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో సెషన్ మధ్యహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ టెట్ 2025 హాల్‌టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
షెడ్యూల్ ప్రకారం జూన్ 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 23న మధ్యాహ్నం, జూన్ 28 తేదీల్లో ఉదయం విడతల్లో మాత్రమే ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు 16 విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా జూన్ సెషన్ టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇందులో పేపర్ 1కు 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పూర్తి షెడ్యూల్‌ను ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలంగాణ టెట్ 2025 జూన్ ఎగ్జాం షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ తరగతులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం గురువారం (జూన్ 12) విద్యాసంస్థలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహించనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 210 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025-26 ఏడాదికి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని అన్ని రాష్ట్రాల డీఈవోలకు ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.