TS TET 2023 Exam: తెలంగాణ టెట్‌-2023 పరీక్ష ఫీజు భారీగా పెంపు.. ఆందోళనలో నిరుద్యోగులు

|

Aug 03, 2023 | 4:02 PM

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) దరఖాస్తు ఫీజును పాఠశాల విద్యాశాఖ మళ్లీ పెంచింది. దాదాపు రూ.100 పెంచడంపై విమర్శలొస్తున్నాయి. 2016లో తొలిసారి నిర్వహించిన టెట్‌ పరీక్షకు రూ.200 ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పేర్కొంది. 2017లోనూ అదే రుసుం కొనసాగించారు. 2022 జూన్‌లో పరీక్ష ఫీజును రూ.300కి పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగో సారి టెట్‌ పరీక్ష..

TS TET 2023 Exam: తెలంగాణ టెట్‌-2023 పరీక్ష ఫీజు భారీగా పెంపు.. ఆందోళనలో నిరుద్యోగులు
TS TET 2023
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 3: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) దరఖాస్తు ఫీజును పాఠశాల విద్యాశాఖ మళ్లీ పెంచింది. దాదాపు రూ.100 పెంచడంపై విమర్శలొస్తున్నాయి. 2016లో తొలిసారి నిర్వహించిన టెట్‌ పరీక్షకు రూ.200 ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పేర్కొంది. 2017లోనూ అదే రుసుం కొనసాగించారు. 2022 జూన్‌లో పరీక్ష ఫీజును రూ.300కి పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగో సారి టెట్‌ పరీక్ష నిర్వహిస్తుండగా రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ.400కి పెంచారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాయనున్నారు. రూ.400 ఫీజు ఒక్కసారి చెల్లించి పేపర్‌-2తో పాటు పేపర్‌-1 కూడా రాసుకోవచ్చు. అయితే పేపర్‌-1 మాత్రమే రాసే డీఈడీ అభ్యర్ధులు తాము కూడా రూ.400 ఫీజు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా రాష్ట్ర, జాతీయ స్థాయి ఉద్యోగ పోటీ పరీక్షలైనా, ప్రవేశ పరీక్షలైనా ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన వారికి ఫీజులో కొంత రాయితీ ఉంటుంది. ఐతే టెట్‌ పరీక్షకు మాత్రం ఎటువంటి రాయితీ ఇవ్వడం లేదు. ఫీజులు భారంగా ఉన్నాయని, కనీసం ఈసారైనా ఫీజు తగ్గించాలని రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.