TG Junior Lineman Posts: నిరుద్యోగులకు భలేఛాన్స్‌.. ఈ నెలలోనే 3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్

|

Oct 17, 2024 | 2:59 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వడివడిగా ఏర్పాట్లు చేస్తుంది. త్వరలోనే రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు సమాయాత్తమవుతున్నాయి..

TG Junior Lineman Posts: నిరుద్యోగులకు భలేఛాన్స్‌.. ఈ నెలలోనే 3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్
TGSPDCL
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్యన్యూస్‌.. త్వరలోనే రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ మేరకు డిస్కంలు రంగం సిద్ధం చేస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌), వరంగల్‌ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎన్‌ఎస్పీడీసీఎల్‌)ల్లో ఇప్పటికే 3,500 వరకు జేఎల్‌ఎం, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ నెలలోనే ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

టీఎన్‌ఎస్పీడీసీఎల్‌లో 1,550 వరకు జేఎల్‌ఎం పోస్టులు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌ పరిధిలోనే 550 ఖాళీలున్నాయి. గతంలో ఇచ్చిన నియామక నోటిఫికేషన్‌లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో హైదరాబాద్‌ నగర పరిధిలో ఏకంగా 200 వరకు పోస్టులు మిగిలిపోయాయి. వీటన్నిటినీ కలిపి మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. మహిళలు కూడా ఈ పోస్టులకు అర్హులు కావడంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 50 వరకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులు ఉండటంతో వీటి భర్తీకి కూడా టీజీఎస్పీడీసీఎల్‌ నియామక ప్రకటన జారీ చేయనుంది.

జేఎల్‌ఎం, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీకి అక్టోబరులోనే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు డిస్కంలు ప్రయత్నిస్తున్న ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వ అనుమతి మేరకే ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ అంశం తేలిన తర్వాతే తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్లు అని ఇటీవల ఉపసంఘం ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ముందుగానే ఉద్యోగ ప్రకటన ఇచ్చిరా పోస్టుల భర్తీ నాటికి వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి వ్యవహరించాలని డిస్కంలు భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతిస్తే.. ఈ నెలలోనే ప్రకటన వెలువడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.