TSLPRB Recruitment: తెలంగాణలో డ్రైవర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు.. ఐటీఐ అర్హతతో నెలకు రూ. 90 వేల వరకు జీతం..

TSLPRB Recruitment: తెలంగాణ స్టేట్‌ లెవట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (TSLPRB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఈ సంస్థ డిజాస్టర్‌ రెస్పాన్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగాల్లో ఉన్న డ్రైవర్‌...

TSLPRB Recruitment: తెలంగాణలో డ్రైవర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు.. ఐటీఐ అర్హతతో నెలకు రూ. 90 వేల వరకు జీతం..
Tslprb Recruitment
Follow us

|

Updated on: May 23, 2022 | 6:20 AM

TSLPRB Recruitment: తెలంగాణ స్టేట్‌ లెవట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (TSLPRB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఈ సంస్థ డిజాస్టర్‌ రెస్పాన్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగాల్లో ఉన్న డ్రైవర్‌ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో బాగంగా డిజాస్టర్‌ రెస్పాన్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగంలో ఉన్న 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. (లేదా) పదో తరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ మెకానిక్‌ డీజిల్‌/ ఫిట్టర్‌ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వాలిడ్‌ హెచ్‌ఎంవీ లైసెన్స్‌తో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. తాజాగా ప్రభుత్వ యూనిఫాం సర్వీసులకు మరో ఐదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇచ్చింది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. డ్రైవింగ్‌ టెస్ట్‌, రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,040 నుంచి రూ.92,050 వరకు చెల్లిస్తారు.

* తెలంగాణకు చెందిన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతర (ఓసీ/బీసీ) అభ్యర్థులు రూ. 800 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ 26-05-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…