
హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 ఆన్‌లైన్ రాత పరీక్షలు డిసెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈమేరకు హాల్‌టికెట్స్‌ను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ సెట్ 2025 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ సెట్ 2025 రాత పరీక్షలు డిసెంబర్ 22వ తేదీ నుంచి 24 వరకు మొత్తం 3 రోజుల చొప్పున రోజు 2 షిప్టుల చొప్పున తెలంగాణ సెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటి నిర్వహిస్తుంది. మొదటి రోజు ఉదయం సెషన్‌లో జాగ్రఫీ, జర్నలిజం,సంస్కృతం, హిందీ, లైఫ్ సైన్సెస్ పేపర్లు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఉర్దూ, తెలుగు, ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ ఉంటాయి. టీజీ సెట్ -2025 పరీక్షలు మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో పరీక్ష ఉంటుంది. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. మొత్తం మూడు గంటల పాటు ఈ పరీక్ష నిర్వహిస్తారు. సెట్ పరీక్షలో అర్హత సాధించిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.
తెలంగాణ సెట్ 2025 అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) 2025 టైర్ 1 ఫలితాలు తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసిన ఫలితాలను పొందవచ్చు.
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1 ఫలితాల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.