AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో వారంలో రాష్ట్రంలో అన్ని డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌.. కారణం ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలు మరోమారు మూతపడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల నిర్వహణ సంఘం ప్రకటన వెలువరించింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది..

మరో వారంలో రాష్ట్రంలో అన్ని డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌.. కారణం ఇదే!
Telangana Colleges Threaten To Close From October 13
Srilakshmi C
|

Updated on: Oct 07, 2025 | 7:01 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలు మరోమారు మూతపడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల నిర్వహణ సంఘం ప్రకటన వెలువరించింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేకుంటే అక్టోబర్ 13 నుంచి ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మూసివేయనున్నట్లు పేర్కొంది. గత నెలలో రూ.900 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ అక్టోబర్ 1 వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. దసరాకు ముందు మరో రూ.600 కోట్లు, దీపావళికి ముందు అదనంగా రూ.600 కోట్లు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు పెండింగ్‌ బకాయిలు చెల్లించలేదని ఆయన అన్నారు.

మిగిలిన బకాయిలను అక్టోబర్ 12 నాటికి విడుదల చేయాలని, లేదంటే అక్టోబర్ 13 నుంచి అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సంఘానికి మద్దతు తెలుపుతూ దసరాకు ముందు రూ.1,200 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ దాదాపు రూ.10 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.

కాగా ప్రైవేట్‌ కాలేజీలు ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై సమ్మె చేస్తామని బెదిరించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అసోసియేషన్ తో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్‌ ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఈ వారం కళాశాల యాజమాన్యాలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం