
హైదరాబాద్, ఆగస్ట్ 20: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్ట్‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ప్రతి అభ్యర్థి వివరాలను, ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను, వెయిటేజీ ద్వారా పొందిన మార్కులను లిస్ట్‌లో పొందుపర్చింది. పరీక్షలు రాసిన అభ్యర్ధులందరూ తాము పొందిన మార్కులు, ఇతర అంశాలను సరి చూసుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్2వ తేదీ లోపు తెలియజేయాలని సూచించింది.
అభ్యంతరాల నమోదుకు ఆగస్ట్ 26 నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో సదుపాయం కల్పిస్తామని బోర్డు పేర్కొంది. కాగా మొత్తం 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 23వ తేదీన ఆన్‌లైన్ విధానంలో (computer based test) రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీ గతేడాది నవంబర్ 26వ తేదీన వెల్లడించారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన బోర్డు మే 5, 2025వ తేదీన తుది ఆన్సర్ కీ ని విడుదల చేసింది. తాజాగా నార్మలైజేషన్ చేసి మార్కులతో కూడిన ప్రొవిజనల్ లిస్ట్‌ను బోర్డు విడుదల చేసింది. అయితే వెయిటేజీ మార్కుల వివరాలను మాత్రం బోర్డు వెల్లడించలేదు. ఈ వివరాలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్ధుల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేస్తారని MHSRB తన ప్రకటనలో తెలిపింది.
మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు లేవనెత్తే అభ్యర్ధులకు ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరిస్తామని బోర్డు తెలిపింది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యో్గ వార్తల కోసం క్లిక్ చేయండి.