Inter Exams 2026 Postponed: విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త టేం టేబుల్‌ ఇదే

ఇంటర్‌ బోర్డు ఇటీవల ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 టైం టేబుల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు పరీక్షలు జరగనుండగా.. సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే తాజాగా ఇంటర్ బోర్డు..

Inter Exams 2026 Postponed: విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త టేం టేబుల్‌ ఇదే
Telangana Inter 2026 Revised Time Table

Updated on: Dec 16, 2025 | 10:10 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 16: తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఇటీవల ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 టైం టేబుల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు పరీక్షలు జరగనుండగా.. సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే తాజాగా ఇంటర్ బోర్డు ఇంటర్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన వెలువరించింది. ఇంటర్‌ సెకండియర్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చేసింది. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను 4వ తేదీకి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. మార్చి 3న హోళీ పండుగ ఉండటంతో షెడ్యూల్‌లో 4వ తేదీన ఆ పరీక్షలు నిర్వహించనున్నట్లు మార్పు చేసింది.

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితాలో మార్చి 3న హోళీ పండుగ నాడు సెలవుగా పేర్కొంది. దీంతో ఇంటర్‌ టైం టేబుల్‌లో మార్పు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో జారీ‌ కానున్నాయి. ఇంటర్ అధికారులు గతంలో మార్చి 4న హోలీ పండుగ ఉంటుందని భావించారు. మిగిలిన పరీక్షలన్నీ గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు అవే తేదీల్లోనే జరుగుతాయని అధికారులు తెలిపారు.

ఇంటర్‌ రాత పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై.. మార్చి 18 వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు ఉంటాయి. ఇక ఫిబ్రవరి 2 నుంచి 21 ప్రాక్టికల్స్‌ ఎలాంటి మార్పులు లేకుండా యథతథంగా జరుగుతాయని తెల్పింది. మొత్తం 3 విడతల్లో ఈ ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. ఫిబ్రవరి 21న ఫస్టియర్‌, ఫిబ్రవరి 22న సెకండియర్‌కు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.