నిపుణులైన భవన నిర్మాణ కార్మికులకు ఇజ్రాయెల్ బంపర్ ఆఫర్.. లక్షల్లో జీతం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వాస్తవానికి నిర్మాణ రంగంలో భారతీయ కార్మికుల పనితీరుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతేకాదు.. ఎన్నో దేశాల్లో సంక్షోభం తలెత్తినా దైర్యంగా తమ పనిని చేసిన పేరు ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అనేక మంది కార్మికులు పశ్చిమాసియా దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ లో ఉన్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే..
భారతీయ కార్మికులను తమ దేశానికి ఆహ్వానిస్తోంది ఇజ్రాయెల్. తమ దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ కార్యక్రమంలో భాగంగా అనేక ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ నేపధ్యంలో అక్కడ నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఆ దేశం తమకు నమ్మకమైన దేశాల నుంచి మంచి పని నైపుణ్యం కలిగిన వారిని తమ ప్రాజెక్టు పనిలో నియమించుకోవాలని భావించింది. భారత ప్రభుత్వంలో ఓ ఒప్పం చేసుకుంది. అంతేకాదు తాజాగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుంచి కార్మికులను తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది.
తెలంగాణలో నుంచి 10 వేల మంది కార్మికులను తీసుకోవాలని భావిస్తోన్న ఇజ్రాయిల్ అధికారులు ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నైపుణ్య పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంది. ఆ దేశంలో ఉద్యోగం కావాలనుకునే వారు తమ స్కిల్స్ ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో విజయం సాధిస్తే.. ఆ కార్మికులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను వెరిఫై చేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ ద్వారా వ్యక్తిగత నడవడిక, కుటుంబ నేపధ్యాన్ని పరిశీలించి అప్పుడు వర్క్ పర్మింట్ వీసాలను ఇజ్రాయెల్ అధికారులు మంజూరు చేస్తారు.
అయితే ఇలా పరీక్షలో ఎంపికైన కార్మికులకు ఇక్కడే కొంత సమయం శిక్షణ ఇవ్వాలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC ) సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగ వివరాలు.. జీతం
పని చేయాల్సిన రంగాలు: భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు మంచి అవకాశం.. ముఖ్యంగా ఫ్రేమ్‌వర్క్, షట్టరింగ్ కార్పెంటర్, ఐరన్ బెండింగ్, సిరామిక్ టైల్, ప్లాస్టరింగ్ లో నియామకాలను చేపడుతున్నారు.
వేతనం : 6,100 ఇజ్రాయెలీ న్యూషెకల్ (మన దేశ కరెన్సీలో రూ.1,37,260పైగా)
విద్యార్హతలు : టెన్త్ పాస్ అయ్యి.. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 25 నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి
పని చేసే సమయం: ఫస్ట్ ఒక ఏడాది పని చేయాల్సి ఉంటుంది.. తర్వాత అవసరం బట్టి పని చేసే కాల వ్యవధిని పెంచే అవకాశం ఉంది.
పని చేయాల్సిన సమయం : 9 గంటలు.. ఓవర్‌టైమ్ పని చేస్తే అందుకు అదనపు వేతనం ఇస్తారు.
ఎంపిక అయిన కార్మికులు ఇజ్రాయెల్ వెళ్లేందుకు విమాన టికెట్, వైద్యపరీక్షల ఖర్చు తో పాటు అక్కడ భోజనం, వసతి కూడా భరించాల్సి ఉంటుంది. వసతి, భోజనం కోసం కార్మికుడి నెలకు 278-449 ఇజ్రాయెలీ న్యూషెకల్ ను మినహాయించుకుంటారు.
వాస్తవానికి నిర్మాణ రంగంలో భారతీయ కార్మికుల పనితీరుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతేకాదు.. ఎన్నో దేశాల్లో సంక్షోభం తలెత్తినా దైర్యంగా తమ పనిని చేసిన పేరు ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అనేక మంది కార్మికులు పశ్చిమాసియా దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది.
భారీ స్పందన
ప్రస్తుతం ఇజ్రాయెల్ లో ఉన్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇజ్రాయెల్ లో పనిచేయడానికి కార్మికులు ముందుకు వస్తారా అని అనుమానంతో ఇజ్రాయెల్ దేశ ప్రతినిధులు టామ్‌కామ్ అధికారులను ముందుగా సంప్రదించినట్లు తెలుస్తోంది. అప్పుడు తెలంగాణాలోని పలు జిల్లాల నుంచి భారీ స్పందన వచ్చింది. దాదాపు 2 వేల మందికి పైగా కార్మికులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో రిక్రూట్మెంట్ కోసం మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో డ్రైవ్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.
మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..