Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్‌లను తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో 1654 గెస్ట్ లెక్చరర్‌లను తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామరావు కీలక ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధంచిన పూర్తి వివరాలు మరో రెండు రోజుల్లో రానున్నాయి.
ఇదిలా ఉంటే గతంలో పని చేసిన వారినే రెన్యూవల్ చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఆలోచన చేస్తుంది. అయితే ఒకవేళ గతంలో పనిచేసిన వారు ఏ కారణంతోనైనా అందుబాటులో లేకపోతే కొత్త వారిని ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై త్వతరలోనే సంబంధిత కాలేజీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యే అవాకాశాలున్నాయి.
ఇక ఈ గెస్ట్ లెక్చరర్ల నియామకంపై ఇంటర్ బోర్డు నుంచి త్వరలోనే స్పష్టత రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది ఔత్సాహికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Dry Grapes Benefits: ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టి రోజూ పరగడుపున తింటే కలిగే లాభాలు ఎన్నో