AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP IT Branding: ఐటీ బ్రాండింగ్‌పై ఏపీ సర్కార్ ఫోకస్.. “వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల” ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం

ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక​దృష్టి సారించింది. డిసెంబర్‌ 24 నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు.

AP IT Branding: ఐటీ బ్రాండింగ్‌పై ఏపీ సర్కార్ ఫోకస్.. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం
Mekapati Goutham Reddy
Balaraju Goud
|

Updated on: Oct 13, 2021 | 5:37 PM

Share

AP Working From Home Township: ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక​దృష్టి సారించింది. డిసెంబర్‌ 24 నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ బ్రాండింగ్‌ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆశించారు. ఆయన బుధవారం ‘వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల’ ఏర్పాటులో పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

పైలట్ ప్రాజెక్టును 29 ప్రాంతాల్లో ప్రారంభించే దిశగా ఐటీ శాఖ కసరత్తు చేస్తుందని మంత్రి తెలిపారు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్‌సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరిస్తానని పేర్కొన్నారు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని, ఐటీ బ్రాండింగ్‌పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఐటీ అధికారులను మంత్రి ఆదేశించారు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్‌సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.

త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరిస్తానన్న మంత్రి మేకపాటి.. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ కూడా అవసరమన్నారు. సమాచార పౌరసంబంధాల శాఖ సమన్వయంతో అపీటా ప్రమోషన్ పై మరింత ఫోకస్ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టులో కీలకమైన విద్యుత్, ఇంటర్నెట్ ఇబ్బందులను అధిగమిస్తామని ఐటీ శాఖ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఎంబీపీఎస్ మరీ తక్కువ ఉందని మంత్రికి తెలిపిన ఐటీ ఉన్నతాధికారులు.. ఐటీ బ్రాండింగ్ స్ట్రాటజీ ఆవశ్యకత ఎంతో ఉందని వివరించారు. కాగా, నవంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ సన్నద్ధం అవుతోంది.

Read Also…  AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ అమలుకు సర్కార్ రంగం సిద్ధం..!