KGBV Schools: ఇకపై కేజీబీవీల్లోనూ ఇంటర్‌ విద్య.. ఏర్పాట్లు చేస్తున్న సర్కార్!

నిరుపేద విద్యార్ధులకు, తల్లిదండ్రులు కోల్పోయిన బాలికలకు ఉచిత విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ)ల్లో.. ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మొదట్లో వాటిల్లో బోధిస్తుండగా.. ఇకపై ఇంటర్ విద్య కూడా ప్రవేశపెట్టాలని..

KGBV Schools: ఇకపై కేజీబీవీల్లోనూ ఇంటర్‌ విద్య.. ఏర్పాట్లు చేస్తున్న సర్కార్!
KGBV Schools

Updated on: Mar 31, 2025 | 6:57 AM

హైదరాబాద్‌, మార్చి 31: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయల్లో పేద విద్యార్ధులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదరికంతో బడికి దూరమైన వారు, తల్లిదండ్రులు కోల్పోయిన బాలికలకు ఉచిత విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ)ల్లో.. ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తొలుత 2005లో కేజీబీవీలు ఏర్పాటు చేసినా.. తొలినాళ్లలో ఆదరణ తక్కువగానే ఉండేది. కానీ నేటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పుడు ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. 6 నుంచి 10వ తరగతి వరకు మొదట్లో వాటిల్లో బోధించగా.. 2018లో పలు కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య ప్రవేశపెట్టారు. కేవలం స్కూల్‌ విద్యకు మాత్రమే పరిమితమైన కేజీబీవీల్లో ఇకపై ఇంటర్‌ విద్యను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఒక్కో కోర్సుకు ప్రథమ సంవత్సరంలో 40, ద్వితీయ సంవత్సరంలో 40 మంది బాలికలకు ప్రవేశాలను కల్పిస్తున్నారు. విద్యార్థినులకు చదువుతోపాటు భోజనం, ఇతర వసతి సౌకర్యాలను సమకూరుస్తున్నారు. ఇంటర్‌ పూర్తికాగానే విద్యార్థినులు ఈఏపీసెట్, నీట్‌ పరీక్షలు రాసేలా ప్రోత్సహిస్తూ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వృత్తి విద్య కోర్సులతోపాటు కుట్లు, అల్లికలు, కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కొనేలా వారిని పలు కార్యక్రమాల ద్వారా తీర్చిదిద్దుతున్నారు.

ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) జూనియర్‌ అసోసియేట్ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) క్లరికల్‌ కేడర్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు తాజాగా విడుదల విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌ 10, 12 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. కాగా ప్రిలిమినరీ పరీక్షలు ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1వ తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 13,735 జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్‌లో 342, అమరావతి సర్కిల్‌లో 50 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.