Christmas Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. క్రిస్మస్‌ సెలవులు వచ్చేస్తున్నాయ్! మొత్తం ఎన్ని రోజులంటే..

Telangana Christmas School Holidays 2025: రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో రాత్రి చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో చీకటి పడ్డాక చాలా వరకు ఆరు బయట జనసంచారం తక్కువగా ఉంటుంది. ఇక సెలవు దొరికితే జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నెలలో ఉద్యోగులు, విద్యార్థులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులు కాస్త భారీగానే..

Christmas Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. క్రిస్మస్‌ సెలవులు వచ్చేస్తున్నాయ్! మొత్తం ఎన్ని రోజులంటే..
Christmas Holidays To Schools

Updated on: Dec 07, 2025 | 5:14 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7: రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో రాత్రి చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో చీకటి పడ్డాక చాలా వరకు ఆరు బయట జనసంచారం తక్కువగా ఉంటుంది. ఇక సెలవు దొరికితే జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నెలలో ఉద్యోగులు, విద్యార్థులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులు కాస్త భారీగానే రానున్నాయి. 2025 సంవత్సరం చివరి నెలలో క్రిస్మస్ సెలవులు వారాంతపు సెలవులతో కలిపి వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వం జారీ చేసిన అకడమిక్‌ క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్ 2025లో మొత్తం ఆరు రోజులు సెలవులు రానున్నాయి. వీటిలో 7, 14, 21, 28తేదీల్లో ఆదివారాలు, 13న రెండో శనివారం, 27న నాల్గవ శనివారం, డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ రానున్నాయి. క్రిస్మస్ మరుసటి రోజు అంటే డిసెంబర్‌ 26వ తేదీన బాక్సింగ్ డేకి కూడా సెలవు ఉంది. ఈ ప్రకారంగా చూస్తే.. డిసెంబర్ 25 (గురువారం) క్రిస్మస్‌తోపాటు డిసెంబర్ 26 (శుక్రవారం) బాక్సింగ్ డే, డిసెంబర్ 27 (శనివారం) నాల్గవ శనివారం, మరుసటి రోజు ఆదివారంతో కలిపి మొత్తం 4 రోజుల వరకు క్రిస్మస్‌ సెలవులు రానున్నాయి. కొన్ని పాఠశాలలో నాల్గవ శనివారం సెలవు ఉండకపోవచ్చు. 4వ శనివారం కూడా సెలవు ఇస్తే.. డిసెంబర్ 25 నుంచి 28 వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తాయన్నమాట.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి లాంగ్ వీకెండ్‌ రానుంది. క్రిస్మస్ ముందు రోజు అంటే డిసెంబర్ 24 (క్రిస్మస్ ఈవ్)ను ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. ఉద్యోగులు ఈ ఒక్క రోజు కూడా సెలవు తీసుకుంటే డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 28 వరకు అంటే మొత్తం ఐదు రోజుల వరకు సెలవులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక క్రైస్తవ విద్యా సంస్థలకు ఏకంగా డిసెంబర్ 21 నుంచి 28 వరకు మొత్తం 8 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సెలవులకు ముందు నుంచే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దీంతో డిసెంబర్‌, జనవరి రెండు నెలలకు అటు ట్రైన్లు, ఇటు బస్సులు అన్ని చోట్ల ముందుగానే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.