TS EAPCET 2025 Results: మరికొన్ని గంటల్లో ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే!

ఈఏపీసెట్‌ 2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ స్ట్రీమ్‌ ఫలితాలు ఆదివారం (మే 11వ తేదీ) విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

TS EAPCET 2025 Results: మరికొన్ని గంటల్లో ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే!
TS EAPCET 2025 Results

Updated on: May 10, 2025 | 5:54 PM

హైదరాబాద్‌, మే 10: తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ స్ట్రీమ్‌ ఫలితాలు ఆదివారం (మే 11వ తేదీ) విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి డీన్‌కుమార్, కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె విజయకుమార్‌ రెడ్డి తెలిపారు. ఫలితాల విడుదలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈఏపీసెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్ స్పష్టం చేశారు. మే 9న నిర్వహించిన సమావేశం తర్వాత బాలకిష్టారెడ్డి సీఎం కార్యాలయ అధికారులతో సంప్రదించారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌ ఫలితాల వెల్లడికి అంగీకారం తెలపడంతో.. పరీక్షలు ముగిసిన వారంలోపే ఫలితాలు విడుదల చేస్తున్నట్లయ్యింది.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో మూడు విడతల్లో జరిగిన అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 81,198 మంది, మే 2, 3, 4 తేదీల్లో ఆరు విడతల్లో నిర్వహించిన ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 2,07,190 మంది హాజరయ్యారు. మొత్తం 2,88,388 మంది ఈ పరీక్షలు రాశారు. ఫలితాల వెల్లడి అనంతరం అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ నుంచి కూడా ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆలస్యంగా విడుదలకానున్న ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..

సాధారణంగా ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలైన వెంటనే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కూడా విడుదల చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కౌన్సెలింగ్‌ కాస్త ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. అందుకు కారణం జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇప్పటివరకు విడుదల కాకపోవడమే..! దీన్ని బట్టే రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రూపొందించడం జరుగుతుంది. మరోవైపు సీట్లకు ఏఐసీటీఈ నుంచి అనుమతి రాకపోవడం, కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు ఇంకా పూర్తి కాకపోవడం కూడా ఈసారి కౌన్సెలింగ్‌ ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోందనడానికి కారణాలుగా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.