TS Eamcet 2023 Notification: ఈ వారంలోనే తెలంగాణ ఎంసెట్‌-2023 నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఎప్పట్నుంచంటే..

తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎంసెట్‌-2023) నోటిఫికేషన్‌ ఈ వారంలో విడుదల కానుంది. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత..

TS Eamcet 2023 Notification: ఈ వారంలోనే తెలంగాణ ఎంసెట్‌-2023 నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఎప్పట్నుంచంటే..
TS EAMCET 2023 Schedule

Updated on: Feb 21, 2023 | 9:09 PM

తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎంసెట్‌-2023) నోటిఫికేషన్‌ ఈ వారంలో విడుదల కానుంది. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత మార్చి మొదటి వారంలో ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలయ్యేలా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) ప్రణాళిక రూపొందిస్తోంది. ఇక గడచిన మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని తొలగించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇందుకోసం ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేయనుంది. నోటిఫికేషన్‌ జారీ నాటికి జీవో రాకుంటే తర్వాత సర్కారు జారీ చేసే జీవోను అనుసరించి వెయిటేజీపై నిర్ణయం ఉంటుందని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ నుంచే ఎంసెట్‌లో ప్రశ్నలు వస్తాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌, బీఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీ యేట ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.