Telangana EAMCET: రేపే తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. అడ్మిషన్‌ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ ఎత్తివేస్తూ నిర్ణయం.

|

Aug 24, 2021 | 5:14 PM

Telangana EAMCET: బుధవారం తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను నిర్వహించని ప్రభుత్వం..

Telangana EAMCET: రేపే తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. అడ్మిషన్‌ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ ఎత్తివేస్తూ నిర్ణయం.
Follow us on

Telangana EAMCET: బుధవారం తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను నిర్వహించని ప్రభుత్వం ఎంసెట్‌ పరీక్షలను మాత్రం సజావుగా నిర్వహించింది. కరోనా ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో పలుమార్లు ఎంసెట్‌ దరఖాస్తు ప్రక్రియను పొడగిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పరీక్షలను పూర్తి చేసింది. దీంతో తాజాగా పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inను సందర్శించాలి.
* అనంతరం హోమ్‌ పేజీలో ఉండే TS EAMCET result 2021 లింక్‌పై క్లిక్‌ చేయాలి.
* తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, హాల్‌ టికెట్‌ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాలి.
* చివరిగా సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి రిజల్ట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Also Read: Schools Reopen: సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు బంద్‌.. విద్యా సంస్థల పునఃప్రారంభంపై మంత్రి ఏమన్నారంటే.

Viral Video: అయ్యో.! చిరుతకు చిక్కిన జింకపిల్ల.. తల్లడిల్లిన తల్లి జింక.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Ukraine Plane Hijacking: విమానం హైజాకింగ్ ఘటన..తోసిపుచ్చిన ఉక్రెయిన్, ఇరాన్ .. జరిగిందేమిటి ..?