TG DSC 2024 Result Date: నేటితో ముగుస్తున్న డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే!

|

Aug 05, 2024 | 1:22 PM

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జులై 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ రోజుతో (ఆగస్టు 5వ తేదీతో) ముగియనున్నాయి. రాష్ట్రంలో తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా..

TG DSC 2024 Result Date: నేటితో ముగుస్తున్న డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే!
TG DSC 2024 Exams
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జులై 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ రోజుతో (ఆగస్టు 5వ తేదీతో) ముగియనున్నాయి. రాష్ట్రంలో తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఈ పరీక్షకు మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

ఈ రోజుతో డీఎస్సీ పరీక్షలు ముగియనుండటంతో ఫలితాలపై విద్యాశాఖ దృష్టి కేంద్రీకరించింది. త్వరలోనే ఆన్సర్‌ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ ఆన్సర్‌ కీ రూపొందించి, ఫలితాలను కూడా వెల్లడిస్తారు. అంతా సవ్యంగా జరిగితే సెప్టెంబర్‌ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలో ప్రభుత్వం ప్రకటన వెలువరించ నుంది.

టీజీపీఎస్సీ ఏఈ పోస్టుల్లో ఆర్జీయూకేటీ విద్యార్థుల సత్తా

తెలంగాణ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో బాసర ఆర్జీయూకేటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి 2019, 2020, 2021 విద్యా సంవత్సరాల్లో చదువు పూర్తి చేసిన ఏకంగా 50 మందికి పైగా విద్యార్థులు ఎంపికయ్యారు. ఇంత మంది బాసర ఆర్జీయూకేటీ విద్యార్ధులకు ఆ పోస్టులకు ఎంపిక కావడం గమనార్హం. ప్రతిభ చాటిన విద్యార్థులకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అటు ప్రాంగణ నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ తమ విద్యార్థులు సత్తాచాటడం సంతోషకరమని ఆయన అన్నారు. ఎస్సీ కేటగిరీలో సూర్యతేజ అనే విద్యార్ధి రాష్ట్రస్థాయిలో తొలి ర్యాంకు సాధించినందుకు విష్‌ చేశారు. కాగా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.