TG DSC 2024: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ OUలో ఓ అభ్యర్ధి నిరాహారదీక్ష.. రేపట్నుంచే డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల

|

Jul 10, 2024 | 8:52 AM

తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ ఓ వైపు నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు విద్యాశాఖ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా డీఎస్సీ హాల్‌టికెట్లు రేపు (జులై 11వ తేదీ) సాయంత్రం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ..

TG DSC 2024: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ OUలో ఓ అభ్యర్ధి నిరాహారదీక్ష.. రేపట్నుంచే డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల
TG DSC 2024 Row
Follow us on

హైదరాబాద్‌, జులై 10: తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ ఓ వైపు నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు విద్యాశాఖ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా డీఎస్సీ హాల్‌టికెట్లు రేపు (జులై 11వ తేదీ) సాయంత్రం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని పలుమార్లు వెల్లడించింది.

అయితే.. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని.. ఈ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా.. రేవంత్‌ సర్కార్‌ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కితగ్గేది లేదని తెగేసి చెప్పింది. డీఎస్సీ ముగిసిన రెండు రోజులకే అంటే ఆగస్టు 7, 8 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూపు-2 పరీక్షలు కూడా ఉన్నాయి. పరీక్షల ఒత్తిడితో చిత్తవుతున్న అభ్యర్ధులు మానవతా ధృక్పధంతోనైనా డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ కాళ్లావేలా పడుతున్నారు. కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

డీఎస్సీ వాయిదా వేయాలడం వారి కుట్రే.. సీఎం రేవంత్

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్స్ 2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కొందరు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని అన్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోంది. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడుతున్నారని అన్నారు. పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్కో కోచింగ్ సెంటర్లకు వందల కోట్ల ఫీజులు వస్తాయి. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లకే రెండేళ్ల నుంచి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. కానీ నిరుద్యోగులు మాత్రం తీవ్రంగా నష్టపోతారు. అలా జరగకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

డీఎస్సీ వాయిదా కోరుతూ ఓయూ హాస్టల్‌ గదిలో అభ్యర్థి నిరాహార దీక్ష.. వీడియో!

తెలంగాణ డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలని, తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌ సర్కార్‌ తీరును నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థి గోపీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. తానుంటున్న హాస్టల్ గదిలోనే ఆమరణ దీక్షకు ఉపక్రమిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశాడు. డీఎస్సీ అభ్యర్థుల డోస ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ప్రభుత్వ ఏర్పాటు కోసం మమ్మల్ని వాడుకుని వదిలేసిందంటూ సదరు వీడియోలో అభ్యర్ధి గోపీ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.