TG DSC 2024 Verification: ‘అక్టోబర్ 5తో డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయండి’.. జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్‌ ఆదేశం

తెలంగాణ డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌) సెప్టెంబర్‌ 30న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుంచే అంటే అక్టోబర్‌ 1వ తేదీ నుంచే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్ధులను ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాలంటూ అభ్యర్ధుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లకు, ఈమెయిల్‌లకు విద్యాశాఖ అధికారులు..

TG DSC 2024 Verification: 'అక్టోబర్ 5తో డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయండి'.. జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్‌ ఆదేశం
CM Revanth
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 04, 2024 | 2:03 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4: తెలంగాణ డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌) సెప్టెంబర్‌ 30న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుంచే అంటే అక్టోబర్‌ 1వ తేదీ నుంచే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్ధులను ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాలంటూ అభ్యర్ధుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లకు, ఈమెయిల్‌లకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సమాచారాలు పంపించారు. ఇక ఈ ప్రక్రియను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్టోబరు 5వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

సచివాలయంలో అక్టోబరు 3న ఆయన ఈ మేరకు కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. మొత్తం 11,062 మంది ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు 9న ఎల్‌బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయాలని అన్నారు. అందుకు తగిన విధంగా సకాలంలో ధ్రువపత్రాలను పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే 9,090 మందికి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

ముఖ్యమంత్రితో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతోపాటు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ధ్రువపత్రాల పరిశీలన రేపటితో ముగియనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నీ జిల్లాల్లోని ఆయా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు అభ్యర్ధులు హాజరుకావల్సి ఉంటుంది. మార్కులు, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఈ ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఇప్పటికే ఈ జాబితాలు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, డీఈఓ వెబ్‌సైట్లలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు డీఈఓలు గుర్తించిన కేంద్రాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావల్సి ఉంటుంది. అంతా సక్రమంగా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించినట్లు ఈ నెల 9వ తేదీన నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!