Telangana 10th Class Exams 2024: తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్!

తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సారానికి గానూ మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఆయా తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు..

Telangana 10th Class Exams 2024: తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్!
Grace Time To 10th Class Exams

Updated on: Mar 14, 2024 | 7:36 PM

హైదరాబాద్‌, మార్చి 14: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సారానికి గానూ మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఆయా తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేందుకు ఐదు నిమిషాల గ్రేస్ టైం ఇస్తున్నట్లు గురువారం (మార్చి 14) ప్రకటించింది. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

తాజా నిబంధనతో 9.35 గంటల వరకు విద్యార్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలిన పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయోలాజికల్ సైన్స్ పరీక్షలు జరిగే రెండు రోజులలో ఉదయం 9.30 నుంచి ఉదయం 11 గంటల వరకు జరుగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఉంటుంది.

కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణారావు తెలిపారు. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు ఒక్కో పరీక్ష కేంద్రంలో విద్య, రెవెన్యూ శాఖల నుంచి ఒక్కో అధికారి, ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. విద్యార్థులకు తప్పు ప్రశ్నపత్రాలు జారీ చేస్తే ఇన్విజిలేటర్లనే బాధ్యులుగా చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లను పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌ వివరణలు కోరాలని ఆదేశించారు. అటువంటి వారిపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్స్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీసెస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 1997 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.