AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS కఠిన నిర్ణయం.. 12 వేల మంది ఉద్యోగాలు ఊస్టింగ్‌..! ఎందుకంటే..?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2024లో 12,000 ఉద్యోగాలను తగ్గించనుందని ప్రకటించింది. AI, ఆర్థిక మాంద్యం ప్రభావం వలన ఐటీ రంగంలో అనిశ్చితి పెరిగింది. క్లయింట్ల వద్ద ప్రాజెక్టులు విలంబం అవడం, ఖర్చులు తగ్గించుకోవడం వంటి కారణాలతో ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.

TCS కఠిన నిర్ణయం.. 12 వేల మంది ఉద్యోగాలు ఊస్టింగ్‌..! ఎందుకంటే..?
Tcs
SN Pasha
|

Updated on: Jul 27, 2025 | 8:10 PM

Share

సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి.తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని కంపెనీ ఆదివారం తెలిపింది. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, కొత్త టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడం, AIని అమలు చేయడం వంటి కారణాల వల్ల కంపెనీ సిబ్బందికి తిరిగి శిక్షణ ఇవ్వడం, తిరిగి నియామకం చేయడం వంటివి చేస్తోంది.

అయితే ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు 12,200 ఉద్యోగాలను తొలగించనున్నట్లు తెలిపింది. “మా క్లయింట్లకు అందించే సేవలపై ఎటువంటి ప్రభావం ఉండకుండా చూసుకోవడానికి ఈ ప్రక్రియను తగిన జాగ్రత్తతో ప్లాన్ చేస్తున్నాం” అని కంపెనీ వెల్లడించింది. బలహీనమైన డిమాండ్, నిరంతర ద్రవ్యోల్బణం, US వాణిజ్య విధానాలపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా భారతదేశపు 283 బిలియన్ డాలర్ల ఐటీ రంగం క్లయింట్లు అనవసరమైన సాంకేతిక వ్యయాన్ని వెనక్కి తీసుకోకుండా ఉండటాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నెలలో క్లయింట్ నిర్ణయం తీసుకోవడంలో, ప్రాజెక్ట్ ప్రారంభంలో జాప్యాలు జరిగాయని TCS చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె కృతివాసన్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి