TATA Groups: 45 వేల మంది ఉద్యోగులను తీసుకునేందుకు టాటా గ్రూప్ ప్లాన్.. అందరూ మహిళలే..
కోవిడ్ పరిణామాలు, రాజకీయ పరిస్థితులల నేపథ్యంలో యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకోనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు యాపిల్ విడి భాగాలు ఎక్కువగా చైనాలో తయారవుతున్నాయనే విషయం తెలిసిందే. అయితే కొన్ని పరిణామాల నేపథ్యంలో...
కోవిడ్ పరిణామాలు, రాజకీయ పరిస్థితులల నేపథ్యంలో యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకోనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు యాపిల్ విడి భాగాలు ఎక్కువగా చైనాలో తయారవుతున్నాయనే విషయం తెలిసిందే. అయితే కొన్ని పరిణామాల నేపథ్యంలో యాపిల్ తన తయారీ కేంద్రాన్ని భారత్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో ఐఫోన్ తయారీని టాటా గ్రూప్ దక్కించుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టాటా గ్రూప్ రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగులను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తమిళనాడులోని హోసూర్ ప్లాంట్‌లో ఏకంగా 45 వేల మందిని నియమించుకోవడానికి టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరందరూ మహిళా ఉద్యోగులేనని సమాచారం. మహిళలకు పెద్ద పీట వేసే ఉద్దేశంతో టాటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 18 నుంచి 24 నెలల్లో 45 వేల మందిని తీసుకోనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే చెన్నైలో ఉన్న ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీలో గడిచిన సెప్టెంబర్‌లో 5000 మంది మహిళలను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో భారీ ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించుకోవాలనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి. ఇక దేశంలో ఐఫోన్‌లను అసెంబుల్ చేసేందుకు టాటా గ్రూప్ విస్ట్రాన్‌తో ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..