SVPNPA Recruitment: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

|

Feb 05, 2022 | 2:26 PM

SVPNPA Recruitment: హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (SVPNPA)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన అకాడమీలో...

SVPNPA Recruitment: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..
Follow us on

SVPNPA Recruitment: హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (SVPNPA)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన అకాడమీలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, హిందీ ఇన్‌స్ట్రక్టర్‌, వెబ్‌ అడ్మినిస్ట్రేటర్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లలో ఇంటర్మీడియట్‌/ బీఎస్సీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు establishment@svpnpa.gov.in మెయిల్‌ ఐడీకి, ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోదల్చుకునే వారు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఎస్‌వీపీ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ, శివరంపల్లి, హైదరాబాద్‌ 500052 అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 45,186 నుంచి రూ. 1,16,398 జీతంగా అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 18-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Beauty Care Tips: నూనె రాసుకున్న తర్వాత జుట్టు రాలుతోందా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ప్రత్యక్షంగా కలుసుకోనున్న సీఎం కేసీఆర్, బండి సంజయ్..

C-DAC Jobs 2022: సీడ్యాక్‌లో కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు..పూర్తి వివరాలివే!