GATE 2022: గేట్ 2022 వాయిదాపై దాఖలైన పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడలేం!

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022)ను తాత్కాలికంగా వాయిదావేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court)గురువారం (ఫిబ్రవరి 3)న తోసిపుచ్చింది. పరీక్షకు కేవలం 48 గంటల ముందు..

GATE 2022: గేట్ 2022 వాయిదాపై దాఖలైన పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడలేం!
Gate 2022 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 03, 2022 | 12:39 PM

Supreme Court dismisses plea to postpone GATE 2022: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022)ను తాత్కాలికంగా వాయిదావేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court)గురువారం (ఫిబ్రవరి 3)న తోసిపుచ్చింది. పరీక్షకు కేవలం 48 గంటల ముందు పిటీషన్‌ను విచారించడం విద్యార్థుల్లో గంధరగోళానికి దారితీస్తుందని డివై చంద్రచూడ్, సూర్యకాంత్, వికమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది.

“మేము పరీక్షలను వాయిదా వేయలేము. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో దేశంలో పలు విద్యాసంస్థలు తెరచుకుంటున్నాయి. అంతేకాకుండా పిటీషన్‌లో పేర్కొన్న విషయాలు అధికారులు నిర్ణయించాల్సిన విద్యాపరమైన అంశాలు. కోర్టులు ఈ రంగంలో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం. విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం. ఈ పరీక్షకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. దీనిపై కొందరు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పరీక్షకు రెండు రోజుల ముందు సుప్రీంకోర్టు స్టే విధించినట్లయితే, అది గందరగోళానికి దారితీస్తుంది” అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. పిటిషనర్లలో ఒకరు కోచింగ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్న వ్యక్తి అని కూడా జస్టిస్ చంద్రచూడ్ ఎత్తి చూపారు. మొత్తం 9 లక్షల విద్యార్ధులు గేట్ 2022 హాజరవుతుండగా కేవలం 20,000 మంది మాత్రమే ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేశారు. విద్యా అధికారులు మాత్రమే దీనిని పరిశీలించగలరు” అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఆగస్టు 2021లో పరీక్షలకు నోటిఫికేషన్‌లు వెలువడ్డాయని కూడా ధర్మాసనం పేర్కొంది.

పిటిషనర్ తరఫు న్యాయవాది సత్పాల్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. “చాలా రాష్ట్రాలు వారాంతాల్లో లాక్‌డౌన్ విధించాయని, ఇటువంటి పరిస్థితిలో పరీక్షను నిర్వహించడం అన్యాయమని, పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని” కోరారు. అందుకు సమాధానంగా “ఒక నెల తర్వాత పరిస్థితి మెరుగ్గా ఉంటుందని మాకు ఏవిధంగా తెలుస్తుందని?” అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. “అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడూ ఒకే విధమైన పరిస్థితి ఉండదు. ఏవో కొన్ని రాష్ట్రాలకు సమస్యలు ఉంటే.. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులందరి కెరీర్‌లతో మనం ఆడుకోవడం సమంజసం కాదని” న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

కోవిడ్ మహమ్మారి పరిస్థితి కారణంగా ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్ష (గేట్)ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించిన విషయం తెలిసింది. ఈ పిటీషన్‌ను ఈ రోజు విచారించన తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు పిటీషన్‌ను కొట్టివేసింది.

కాగా గేట్ 2022 పరీక్షలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరగనుండగా పరీక్షలను వాయిదావేయాలని బుధవారం (ఫిబ్రవరి 2)న సుప్రీంకోర్టులో పిటీషనల్ దాఖలైంది. శనివారం ప్రారంభమయ్యే పరీక్షకు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అడ్మిట్ కార్డులు కూడా జారీ అయ్యాయి. మొత్తం దేశ వ్యాప్తంగా 200 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి. ఐతే పరీక్ష నిర్వహణకు అధికారులు ఎలాంటి కోవిడ్‌ మార్గదర్శకాలను జారీ చేయలేదని పిటీషనర్లు పేర్కొన్నారు. ఇక విద్యార్ధులు కూడా పరీక్షను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తూ పిటీషన్‌లో సంతకాలు చేశారు.

మరోవైపు గేట్ అడ్మిట్ కార్డులను ఇప్పటికే విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఇళ్ల నుండి గేట్ పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి కర్ఫ్యూ-పాస్‌లు లేదా మూవ్‌మెంట్ పాస్‌లుగా అభ్యర్ధులు తమ అడ్మిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారికంగా ప్రకటించింది. ఇక గేట్ పరీక్ష రిక్రూట్‌మెంట్ కమ్ అడ్మిషన్ టెస్ట్. ఈ పరీక్ష రెండు స్లాటుల్లో నిర్వహించబడుతుంది. మొదటి స్లాట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తదుపరి స్లాట్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది.

Also Read:

‘సీబీఎస్సీ టర్మ్ 2 బోర్డ్ ఎగ్జామ్స్ 2022 షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు.. అది ఫేక్ న్యూస్‘