AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సీబీఎస్సీ టర్మ్ 2 బోర్డ్ ఎగ్జామ్స్ 2022 షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు.. అది ఫేక్ న్యూస్‘

ఇప్పటివరకు 10, 12 తరగతులకు సంబంధించి సీబీఎస్సీ టర్మ్ 2 బోర్డ్ ఎగ్జామ్ 2022 తేదీలను విడుదల చేయలేదు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌..

‘సీబీఎస్సీ టర్మ్ 2 బోర్డ్ ఎగ్జామ్స్ 2022 షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు.. అది ఫేక్ న్యూస్‘
Fake
Srilakshmi C
|

Updated on: Feb 03, 2022 | 10:42 AM

Share

CBSE term 2 board exam 2022: సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నకిళీ వార్తల (fake news)పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా స్పందించింది. సీబీఎస్సీ 10,12 తరగతులకు చెందిన టర్మ్ 2 బోర్డ్ ఎగ్జామ్ – 2022లకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదని, కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సదరు వార్తలన్నింటినీ నమ్మొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ట్విటర్‌లో ఎగ్జాం డేట్స్‌కు సంబంధించి నకిలీ సర్క్యులర్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. సీబీఎస్సీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ మేరకు వివరణ ఇచ్చింది.

ఇప్పటివరకు 10, 12 తరగతులకు సంబంధించి సీబీఎస్సీ టర్మ్ 2 బోర్డ్ ఎగ్జామ్ 2022 తేదీలను విడుదల చేయలేదు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ cbseacademic.nic.in ను తనిఖీ చేయవల్సిందిగా సూచించింది. పరీక్షల హెడ్యూల్ తయారైన తర్వాత వెబ్‌సైట్లో, సీబీఎస్సీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచుతామని తెల్పింది. ఇంటర్నెట్ లేదా ఇతర సోషల్ మీడియాల్లో వచ్చే ఏ సమాచారాన్నైనా విద్యార్ధులు క్రాస్ చెక్ చేసుకుని నిర్ధారించుకోవాలని తెల్పింది. అందుకు విద్యార్ధులు తమ స్కూల్ అధికారులతో కూడా సంప్రదింపులు జరపొచ్చని సూచించింది.

Also Read:

IDBI Bank Jobs 2022: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో బ్యాంక్ ఉద్యోగాలు.. అర్హతలివే!