UGC NET 2021: ఫిబ్రవరిలో.. యూజీసీ నెట్ జూన్ 2021 ఫలితాలు!

యూజీసీ నెట్ జూన్ 2021 (UGC NET 2021), డిసెంబర్ 2020 కంబైన్డ్ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలవ్వనున్నాయి..

UGC NET 2021: ఫిబ్రవరిలో.. యూజీసీ నెట్ జూన్ 2021 ఫలితాలు!
Ugc Net 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 03, 2022 | 12:46 PM

NTA UGC NET Result Date 2022: యూజీసీ నెట్ జూన్ 2021 (UGC NET 2021), డిసెంబర్ 2020 కంబైన్డ్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో విడుదల చేయనుంది. ఈ మేరకు అందిన సమాచారం ప్రకారం ఫలితాలు ఈ నెల (ఫిబ్రవరి)లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో అర్హత సాధించినవారు అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అర్హత సాధిస్తారు. ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్ధులు యూజీసీ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inలో తనిఖీ చేయవచ్చు. దేశ వ్యాప్తంగా మూడు దశల్లో 81 సబ్జెక్టులకు ఎన్టీఏ (NTA) నిర్వహించిన యూజీసీ నెట్ 2020 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలను, రెస్పాన్స్ షీట్ల తనిఖీ అనంతరం అభ్యంతరాలను కూడా పంపించారు. వీటి ఆధారంగా తయారు చేసే తుది ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలు రూపొందించబడతాయి.

Also Read:

GATE 2022: గేట్ 2022 పరీక్ష వాయిదాపై దాఖలైన పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడలేం!