TG School Exams: పాఠశాల విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల తర్వాతే ఎస్‌ఏ 1 పరీక్షలు! పూర్తి టైం టేబుల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దసరా సెలవుల అనంతరం ఈ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ 1 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి సెప్టెంబర్ 25 (బుధవారం)న పూర్తిస్థాయి..
హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దసరా సెలవుల అనంతరం ఈ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ 1 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి సెప్టెంబర్ 25 (బుధవారం)న పూర్తిస్థాయి టైంటేబుల్ విడుదల చేశారు. ఒకటి, రెండు తరగతులకు సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. 3 నుంచి 5 తరగతులకు సెప్టెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు, ఆరు, ఏడు తరగతులకు సెప్టెంబర్ 26వ తేదీ వరకు, 8 నుంచి 10 తరగతుల వారికి సెప్టెంబర్ 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
కాగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు కాలేజీలకు వరుసగా 13 రోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకూ సెలవులు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది కూడా. అక్టోబర్ 2 గాంధీ జయంతి కాగా మిగిలిన రోజుల్లో దసరా, బతుకమ్మ రెండు పండుగలు వస్తాయి. రాష్ట్రంలో బతుకమ్మ ప్రధాన పండుగ కావడంతో రెండు సెలవులు కలిపి ఇచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం మే 25న విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కూడా ఇవే సెలవులు రానున్నాయి. ఇక క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకూ సంక్రాంతి సెలవులుంటాయి.
అక్టోబరు 23తో ముగుస్తున్న తెలంగాణ బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు విద్యార్థులు అక్టోబరు 23వ తేదీ వరకు ప్రవేశాలు పొందొచ్చని ఏఐసీటీఈ ప్రకటించింది. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా విద్యా క్యాలెండర్‌ను సవరించింది. గత మే నెలలో ఇచ్చిన విద్యా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీతో తుది గడువు ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును పొడిగించింది. లేటరల్ ఎంట్రీ ద్వారా విద్యార్థులు బీటెక్ రెండో ఏడాదిలో అక్టోబరు 23వ తేదీ వరకు ప్రవేశాలు పొందచ్చని పేర్కొంది. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని కాలేజీల్లో కొత్త సీట్లను మంజూరు చేయాలని, కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సవరించిన విద్యా క్యాలెండర్‌ను విడుదల చేశారు.