AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Exams: ఏప్రిల్‌ 9 నుంచి బడి పిల్లలకు సమ్మెటివ్‌-2 పరీక్షలు.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్‌ పాఠశాలలకు మార్చి 15 ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు పనిచేస్తున్నాయి. ఇక విద్యార్ధులకు వేసవి సెలవులకు ముందే వార్షిక పరీక్షలు నిర్వహించవల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది..

School Exams: ఏప్రిల్‌ 9 నుంచి బడి పిల్లలకు సమ్మెటివ్‌-2 పరీక్షలు.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?
School Exams
Srilakshmi C
|

Updated on: Mar 17, 2025 | 7:33 AM

Share

అమరావతి, మార్చి 17: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒండి పూట బడులు ప్రారంభమైనాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు పనిచేస్తున్నాయి. అంటే మధ్యాహ్నం విద్యార్ధులకు భోజనం అందించి ఇళ్లకు పంపించేస్తారన్నమాట. అయితే విద్యార్ధులకు వేసవి సెలవులకు ముందే వార్షిక పరీక్షలు నిర్వహించవల్సి ఉంది. ఇందుకోసం ఒకటి నుంచి తొమ్మిది తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ 2 (ఎస్‌ఏ-2) పరీక్షలు ఏప్రిల్‌ 9 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు.

పరీక్షల అనంతరం జవాబుపత్రాలను కూడా వెంటనే మూల్యాంకనం చేసి, మార్చి 23న ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, ప్రోగ్రెస్‌ కార్డులు అందించాలని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మార్చి 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి జూన్‌ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి.

ఇక ఐటీఐల్లో యువతకు ఉపాధి కల్పించే కోర్సులు.. తెలంగాణ కార్మికశాఖ

తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, యువతకు ఉపాధి కల్పించే కొత్తకోర్సులను పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రవేశపెట్టనున్నట్లు కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త నైపుణ్య కోర్సులతో ఐటీఐలను బలోపేతం చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించించిందని, ఈ మేరకు ప్రైవేటు సంస్థల్ని భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 16న హైదరాబాద్‌లో ఉపాధి కల్పనశాఖ, సెంటర్‌ఫర్‌ గుడ్‌గవర్నెన్సు (సీజీజీ) సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ‘మెరుగైన భవిష్యత్తుకు నైపుణ్య తెలంగాణ’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లైఫ్‌సైన్సెస్‌ ఆధారిత రంగాల్లో యువత నైపుణ్యాలు, భవిష్యత్తు అవసరాలు, సామాజిక, ఆర్థిక అంశాలు, సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలు వంటి తదితర అంశాలపై చర్చించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?