SSC Result Dates 2025: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..

SSC CGL and CHSL 2025 Tier 1 Result Dates: కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తుంది. సీబీటీ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 129 నగరాల్లో 260 కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే...

SSC Result Dates 2025: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..
Staff Selection Commission Result Dates

Updated on: Dec 09, 2025 | 3:38 PM

హైదరాబాద్‌, డిసెంబర్ 9: కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తుంది. సీబీటీ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 129 నగరాల్లో 260 కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 16న టైర్‌ 1 ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేసింది. తుది అన్సర్‌ కీ రూపొందిచి, ఆ వెనువెంటనే ఫలితాలను కూడా కమిషన్ వెల్లడించనుంది. కాగా 14,582 గ్రూప్‌ ‘బి’, గ్రూప్‌ ‘సి’ పోస్టుల కోసం ఎస్సెస్సీ ఈ ఏడాది జూన్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 28,14,604 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే టైర్‌ 1 పరీక్ష నిర్వహించగా… ఇందులో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి టైర్‌ 2 పరీక్షకు ఎంపిక చేస్తారు. అనంతరం రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌-1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌ 2 ఆన్సర్‌ కీ విడుదల.. త్వరలోనే ఫలితాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామ్‌ (CHSL 2025) టైర్‌ 1 ఆన్‌లైన్ రాత పరీక్షలు ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీని కమీషన్‌ తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి ప్రాథమిక ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్‌షీట్‌లను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్ధులు డిసెంబర్‌ 8 నుంచి 11 వరకు రూ.50 చెల్లించి ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా టైర్‌ 1 రాత పరీక్షలు నవంబర్‌ 12 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఎస్‌ఎస్‌సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,131 పోస్టులను వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, మొదలైనవాటిలో భర్తీ చేయనుంది. ఇందులో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌ 1 ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.