
కేంద్ర ప్రభుత్వం ఇంజినిరీంగ్ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం ఆధ్వర్యంలోని పలు శాఖల్లో 1324 జూనియర్ ఇంజినీర్ నియామకాలను భర్తీ చేయనుంది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లోమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల్లో నియామకమైనవారు దేశంలోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, విభాగాల్లో గ్రూప్ – బీ నాన్ మినిస్టీరియల్ జూనియర్ ఇంజినీర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చేరాకా సెవెన్త్ పే స్కేల్ ప్రకారం 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలతో.. మొదటి నెల నుంచే 50 వేల నుంచి 55 వేల రూపాయల వరకు జీతం వస్తుంది. వీళ్లు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, కేంద్ర ప్రజాపనుల శాఖ, కేంద్ర జల సంఘం, జల వనరులు, నదుల అభివృద్ధి, షిప్పింగ్ లాంటి వాటిల్లో తమకు సంబంధించిన విభాగాల్లో పని చేసే అవకాశం లభిస్తుంది.
అభ్యర్థులు తమకు సంబంధించిన ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లోనే జూనియర్ ఇంజినీర్‌గా నియమితులవుతారు. తమ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం ఉద్యోగులకు సౌకర్యంగానే కాకుండా ఉద్యోగ విధులు కూడా సంతృప్తిగా ఉంటాయి.
ఎవరు అర్హులు
సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు
వయసు: 18- 32 సంవత్సరాల వయసువారు అర్హులు.. పలు కేటగిరీల అభ్యర్థులకు వయసులో కొంత సడలింపు ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్: 16.08.2023
ఆన్‌లైన్ ద్వారా ఎక్జామ్ ఫీ చెల్లించడానికి లాస్ట్ డేట్: 16.08.2023
ఆన్‌లైన్ పరీక్ష (పేపర్-1): అక్టోబర్, 2023
ఆన్‌లైన్ పరీక్ష (పేపర్-2): ఆ తర్వాత ప్రకటిస్తారు.
ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు http://ssc.nic.in వెబ్‌సైట్‌లో అప్లే చేసుకోవచ్చు
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.