AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRTRI Free Training 2025: గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్‌.. ఉచిత శిక్షణ, హాస్టల్‌ వసతితోపాటు జాబ్‌ గ్యారెంటీ!

తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత ఉద్యోగ శిక్షణతోపాటు హాస్టల్, భోజన, వసతి సౌకర్యం కల్పిస్తుంది. శిక్షణ అనంతరం ఉద్యోగం కూడా కల్పిస్తారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ద్వారా..

SRTRI Free Training 2025: గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్‌.. ఉచిత శిక్షణ, హాస్టల్‌ వసతితోపాటు జాబ్‌ గ్యారెంటీ!
SRTRI Free Training
Srilakshmi C
|

Updated on: May 22, 2025 | 10:12 AM

Share

పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ.. తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత ఉద్యోగ శిక్షణతోపాటు హాస్టల్, భోజన, వసతి సౌకర్యం కల్పిస్తుంది. శిక్షణ అనంతరం ఉద్యోగం కూడా కల్పిస్తారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సులను అందిస్తుంది. ఆసక్తి కలిగిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు మే 29, 2025వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఏయే కోర్సులు అందిస్తారంటే..

  • అకౌంట్స్‌ అసిస్టెంట్‌(ట్యాలీ) కోర్సు
  • కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్ కోర్సు
  • ఆటో మొబైల్ 2 వీలర్‌ సర్వీసింగ్‌ కోర్సు
  • డి.టి.పి కోర్సు

డి.టి.పి, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్ కోర్సులకు ఇంటర్మీడియట్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్‌(ట్యాలీ) కోర్సుకు బీకామ్‌ డిగ్రీ, ఆటో మొబైల్ 2 వీలర్‌ సర్వీసింగ్‌ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అభ్యర్ధుల యోపరిమితి 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. కోర్సు వ్యవధి మూడున్నర నెలలు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఈ కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్లు మే 29, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. సంబంధిత చిరునామాకు చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్లు.. బీబీ నగర్‌, భువనగిరి, సికింద్రాబాద్‌. హైదరాబాద్‌ – దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి 524 నంబరు బస్సు సౌకర్యం కూడా కలదు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

చిరునామా..

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్‌(గ్రామం), పోచంపల్లి(మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ-508 284.

వివరాలకు సంప్రదించండి: 9133908000, 9133908111, 9133908222, 9948466111

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు