SBI PO Mains Result 2021: గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన పీవో పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) విడుదల చేసింది. ఎస్‌బీఐ పీవో మెయిన్స్ 2021 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మెయిన్స్ పరీక్షను జనవరి 2, 202న2న నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫేజ్-3 ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. ఇక ఈ మూడో రౌండ్ ఇంటర్వ్యూను 2022 ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ను త్వరలోనే జారీ చేయనున్నారు.
ఇంటర్వ్యూలో షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఉద్యోగాల్లో నియమిస్తారు. తుది ఫలితాలు 2022 మార్చిలో వెలువడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 2056 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌కు సుమారు 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గతేడాది నవంబర్ నెలలో ప్రిలిమనరీ పరీక్షను నిర్వహించారు.
* పరీక్షకు హాజరైన వారు ముందుగా https://sbi.co.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కింద “మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్”పై క్లిక్ చేయాలి.
* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల దృస్ట్యా ఫలితాలను ప్రింట్ తీసుకోవాలి.
Also Read: తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్న భామ..
UP Elections 2022: ఖేరీ జిల్లాలో నామినేషన్ కోసం కౌంట్‌డౌన్ షురూ.. అభ్యర్థులను ప్రకటించని పార్టీలు!