AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI PO 2025 Exam Date: ఎస్‌బీఐ పీఓ ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఇంతకీ ఎప్పుడంటే?

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO) 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 14, 2025వ తేదీతో ముగిశాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 541 పీఓ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన..

SBI PO 2025 Exam Date: ఎస్‌బీఐ పీఓ ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఇంతకీ ఎప్పుడంటే?
SBI PO 2025 Exam Date
Srilakshmi C
|

Updated on: Jul 18, 2025 | 8:21 AM

Share

హైదరాబాద్‌, జులై 18: స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO) 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 14, 2025వ తేదీతో ముగిశాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 541 పీఓ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్‌ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎగ్జామినేషన్‌కు సంబంధించిన పరీక్ష తేదీలను ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 2, 4, 5 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. అభ్యర్థులు ఈ కింది వెబ్ సైట్ లింక్ ద్వారా పరీక్ష షెడ్యూల్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పీఓ ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎన్‌సీసీ కేడెట్లకు గరిష్ఠంగా 15 శాతం గ్రేస్‌ మార్కులు

ఎన్‌సీసీ ఈవెంట్లలో అవార్డులు సాధించిన అభ్యర్థులకు డిప్లొమా, యూజీ, పీజీ కోర్సుల్లో 1 శాతం కోటా సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సవరించిన ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ జులై 16న జారీ చేశారు. సాంకేతిక ఉన్నత విద్య, వ్యవసాయ, పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల్లోని అన్ని డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులకు ఇది వర్తిస్తుంది. ఆయా కోర్సుల ప్రవేశాల్లో ఎన్‌సీసీ కేడెట్లకు ప్రవేశ పరీక్షల్లో ఏకంగా 15 శాతం వరకు గ్రేస్‌ మార్కులను కలపనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు ఈ గ్రేస్‌ మార్కులు ఇస్తారు. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సుల్లోనూ ఎన్‌సీసీ కేడెట్లకు ప్రవేశపరీక్షల్లో 15 శాతం గ్రేస్‌ మార్కులు కలుపుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..