
హైదరాబాద్, ఫిబ్రవరి 24: రైల్వే శాఖ ఆధ్వర్యంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్) పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి వివరాలు పొందవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, పరీక్ష తేదీ, సమయం, మార్గదర్శకాలు వంటి తదితర సమాచారం మాత్రమే ఉంటుంది. ఇక అడ్మిట్ కార్డులు పరీక్షకు 4 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. .
కాగా మొత్తం 4208 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి RRB ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఆర్‌ఆర్‌బీ ఆర్‌పీఎఫ్ రాత పరీక్షలు (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది. మొత్తం 120 ప్రశ్నలతో 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.. అలాగే తప్పు సమాధానాలకు 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు ఉండవు, తీసీవేయరు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
బీఆర్క్, బిప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30వ తేదీన నిర్వహించిన జేఈఈ (మెయిన్) పేపర్ 2 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 22వ తేదీన తుది కీ విడుదల చేశారు. తాజాగా ఫలితాలను కూడా అందుబాటులో తీసుకువచ్చారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ బీఆర్క్/బిప్లానింగ్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.