RRB NTPC 2024 Exam: మరో వారంలో ఎన్టీపీసీ రైల్వే రాత పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఇదిగో!

భారత రైల్వే శాఖ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ సీబీటీ2 (2024) రాత పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన మాక్‌ టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) అందుబాటులో ఉంచింది. డిసెంబర్‌ 20 నుంచి సీబీటీ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో..

RRB NTPC 2024 Exam: మరో వారంలో ఎన్టీపీసీ రైల్వే రాత పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఇదిగో!
RRB NTPC 2024 Under Graduate CBT 2 Exams

Updated on: Dec 14, 2025 | 10:32 AM

హైదరాబాద్, డిసెంబర్‌ 14: భారత రైల్వే శాఖ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ సీబీటీ2 (2024) రాత పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన మాక్‌ టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) అందుబాటులో ఉంచింది. డిసెంబర్‌ 20 నుంచి సీబీటీ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండా అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత మాక్‌ టెస్టులను ఉపయోగించుకోవచ్చని ఆర్ఆర్‌బీ పేర్కొంది. మాక్‌ టెస్ట్‌లు రాయడం ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది.

కాగా ఎన్టీపీసీ లెవెల్‌ 2కి దేశ వ్యాప్తంగా మొత్తం 51,978 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరూ షిప్టుల వారిగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. గత ఏడాది మొత్తం 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన ఆర్‌ఆర్‌బీ.. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది. ఇంటర్‌ అర్హతతో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది.

ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ 2024 సీబీటీ-2 పరీక్షల మాక్‌ టెస్టుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ప్రశాంతంగా ముగిసిన జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష – 2026

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశాలకు డిసెంబర్‌ 13వ తేదీన దేశ వ్యాప్తంగా రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ప‌రీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీ త్వరలోనే జేఎన్‌వీ విడుదల చేయనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.