RCF Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో.. రైలు కోచ్‌ తయారీ యూనిట్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్).. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కోచ్‌ తయారీ యూనిట్‌లలో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కోసం ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికషన్‌ విడుదల చేసింది. మొత్తం 550 యాక్ట్ అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది..

RCF Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో.. రైలు కోచ్‌ తయారీ యూనిట్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!
Kapurthala Act Apprentice Recruitment

Updated on: Dec 13, 2025 | 3:51 PM

పంజాబ్‌ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్).. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కోచ్‌ తయారీ యూనిట్‌లలో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కోసం ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికషన్‌ విడుదల చేసింది. మొత్తం 550 యాక్ట్ అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. పతో తరగతితోపాటు ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల్లో యూఆర్‌ కేటగిరీలో 275 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 85 పోస్టులు; ఎస్టీ కేటగిరీలో 42 పోస్టులు; ఓబీసీ కేటగిరీలో 148 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్, మోటర్‌ వెహికిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌.. ట్రేడుల్లో భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 7, 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలాంటి రాత పరీక్షలేకుండానే మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజును జనవరి 9, 2026వ తేదీ వరకు చెల్లించవచ్చు. శిక్షణ సమయంలో నిబంధనల మేరకు స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.